News August 18, 2024
విశాఖ: 36ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..

గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌లో 1987-88లో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో సమావేశమయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపారంలో స్థిరపడిన వారు సమావేశానికి హాజరయ్యారు. తరగతి గదుల్లో అప్పుడు చేసిన అల్లరి, చిలిపి పనులు తలుచుకొని ఆనందంతో పులకించారు. అనంతరం గురువులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 7, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విశాఖ: రోడ్డు ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చిన్నారావు తన బైక్పై ఇంటికి వెళుతుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఓ వాహనం ఢీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలిని పరిశీలించిన దువ్వాడ పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.