News September 19, 2024
విశాఖ: 4,972 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు
బైకర్‌లు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం సూచించారు. గోపాలపట్నంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తున్న 4,972 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో 5,543 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News October 11, 2024
కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ శ్రీ భరత్
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయాన్ని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
News October 11, 2024
విశాఖలో ప్రీమియర్ షో చూసిన హీరో సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో ‘ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీమియర్ షోను గురువారం ద్వారకానగర్‌లోని సంఘం థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. సినిమా ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఆయన వెల్లడించారు.
News October 10, 2024
తాతయ్యబాబుకి గృహ నిర్మాణ మంత్రి అభినందనలు
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం విజయవాడలో బాధ్యతలు చేపట్టిన తాతయ్య బాబును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి అభినందించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయనకు మంత్రి సూచించారు. పేదలందరికి పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.