News September 21, 2024
విశాఖ: 51 మంది వీఆర్వోలకు బదిలీలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడ్-2 వీఆర్వోలకు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల కోసం మొత్తం 234 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 51 మందికి బదిలీలు నిర్వహించినట్లు డీఆర్ఓ తెలిపారు.
Similar News
News October 4, 2024
ఏయూకి ఐఎస్ఓ సర్టిఫికేషన్
ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికేషన్ 2027 వరకు ఈ గుర్తింపు అందించింది. ఇటీవల ఏయూను సందర్శించిన ఐఎస్ఓ నిపుణుల బృందం ఏయూలో వివిధ అంశాలను పరిశీలించి ఈ గుర్తింపును కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలు ఏయూ ఐక్యూ ఏసీ సమన్వయకర్త ఆచార్య జి.గిరిజా శంకర్ స్వయంగా ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణ రావుకు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.
News October 4, 2024
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైఎస్ షర్మిల కీలక ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో సీఎంను కలుస్తామన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు.
.
News October 4, 2024
విశాఖలో రెండో రోజు టెట్ పరీక్షకు 1662 మంది హాజరు
జిల్లాలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు రెండో రోజు శుక్రవారం 1662 మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో రోజు 1852 మంది విద్యార్థుల పరీక్ష రాయాల్సి ఉందన్నారు. తాను ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిందని వివరించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అవి వెల్లడించారు.