News July 30, 2024

విశాఖ 6,7,8 వార్డుల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

image

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 2వ జోన్ పరిధిలో 6,7,8 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ కె.వి.ఎన్.రవి మంగళవారం తెలిపారు. రెండవ జోన్ పరిధిలో గోస్తని నది జలాలకు బోని గ్రామం వద్ద ఉన్న గోస్తని హెడ్ వాటర్ వర్క్స్ వద్ద 700MM డీఐ పైపులైను లీకులు ఏర్పడ్డాయన్నారు. వాటి మరమ్మతుల కారణంగా బుధవారం తాగునీరు సరఫరా ఉండదన్నారు.

Similar News

News October 21, 2025

వ్యాపారులు డస్ట్ బిన్‌లు ఉపయోగించాలి: జీవీఎంసీ కమిషనర్

image

వ్యాపారులు దుకాణాల ముందు డస్ట్ బిన్లు ఉపయోగించాలని, లేనియెడల వారి లైసెన్సులు రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. మంగళవారం ఆరిలోవలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాంసం, పూల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వారిచేత క్లీన్ చేయించారు. టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడంతో రూ.1000 అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌‌ను ఆదేశించారు.

News October 21, 2025

సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా సుజాత

image

సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా ప్రస్తుతం జోనల్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాతకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ ఈవోగా వ్యవహరిస్తున్న త్రినాథరావు రిలీవ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది.

News October 21, 2025

విశాఖ జూపార్క్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య

image

విశాఖ జూ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డెయిరీ ఫారం నుంచి ఎండాడ వైపు వెళ్తున్న జాతీయ రహదారి పక్కన చెట్టు కొమ్మకు ఓ వ్యక్తి ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళన చెందారు. వీరి సమాచారంతో ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.