News March 7, 2025

విశాఖ: 8న జాతీయ లోక్ అదాలత్

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని ఆ సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Similar News

News March 24, 2025

సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

image

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

News March 24, 2025

విశాఖ కలెక్టరేట్లో ఫిర్యాదుదారులకు స్నాక్స్

image

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతలు అందించేందుకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని ఫిర్యాదుదారులకు మజ్జిగ, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అందిస్తున్నారు. వృద్ధులకు సైతం ఇబ్బందులు లేకుండా వీల్ ఛైర్లు ఏర్పాటు చేశారు. 

News March 24, 2025

విశాఖలో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

image

వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మ.2 నుంచి రాత్రి 12 గంటల వరకు మధురవాడ స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా దారి మళ్లించారు.

error: Content is protected !!