News January 27, 2025

విశాఖ: 8 పర్యాటక ప్రాజెక్టులకు ఎంవోయూలు

image

విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖలో ఓ హోటల్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు 150కి పైగా పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 825 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు.

Similar News

News November 19, 2025

విశాఖ కమిషనరేట్‌లో వెయిటింగ్ హాల్ ప్రారంభం

image

విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమిషనరేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో అంచ‌నాల కమిటీ ప‌ర్య‌ట‌న‌

image

AP అంచ‌నాల క‌మిటీ ఈనెల 25-29 వ‌రకు ఉత్త‌రాంధ్రలో ప‌ర్య‌టించ‌నుంది. ఛైర్మ‌న్ వేగుళ్ల జోగేశ్వ‌రరావు అధ్య‌క్ష‌త‌న క‌మిటీ స‌భ్యులు 25న విశాఖ‌ చేరుకుంటారు. 26న సింహాచ‌లంలో స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మావేశమౌతారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్‌‌లో అధికారులతో చ‌ర్చించ‌నున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షిస్తారు.