News August 6, 2024

విశాఖ: 838 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 838 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు రిటర్నింగ్ అధికారి కే.మయూర్ అశోక్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థిని పదిమంది ఓటర్లు బలపర్చాల్సి ఉంటుందన్నారు.

Similar News

News October 31, 2025

సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

image

సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం సిరిపురం జంక్షన్ వద్ద గల పటేల్‌ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.

News October 31, 2025

విశాఖ రైతు బజార్‌లకు 3 వారాలపాటు సెలవులు లేవు

image

మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖలోని అన్ని రైతు బజార్‌లు వచ్చే 3 వారాల పాటు నిరంతరంగా కొనసాగించాలని CEO ఆదేశాలు జారీ చేశారు. వారానికి 7 రోజులు మార్కెట్లు పూర్తిగా ఓపెన్‌గా ఉంచాలని సూచించారు. ప్రజలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీని ఆదేశించారు.

News October 31, 2025

విశాఖ: నదిలో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

image

విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలోని గెడ్డలో గురువారం ధనుశ్రీ (13) గల్లంతైన విషయం తెలిసిందే. తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయింది. ధనుశ్రీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి రోదన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.