News August 6, 2024

విశాఖ: 838 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 838 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు రిటర్నింగ్ అధికారి కే.మయూర్ అశోక్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థిని పదిమంది ఓటర్లు బలపర్చాల్సి ఉంటుందన్నారు.

Similar News

News December 10, 2024

విశాఖ: హస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు పరార్

image

అల్లిపురం మహారాణిపేట పోలీసు పరిధి, అంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు పరారైనట్లు హోమ్ ఇన్‌ఛార్జ్ కచ్చా వేళంగిరి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రార్థనలకు చర్చికి వెళ్లిన గుడాల రఘ, బెడపాటి చరణ్, నక్కాల కిరణ్ కుమార్, కార్తీక్ సాయంత్రం అయిన రాలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో వెదికారు.

News December 10, 2024

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.2.81కోట్లు

image

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 39 రోజులకు గాను ఆలయ అధికారులు ఈఓ త్రినాథ్ రావు పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. మొత్తం రూ.2,81,93,913 ఆదాయం వచ్చింది. బంగారం 126 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 15 కిలోల 140 గ్రాములు, 9దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

News December 9, 2024

విశాఖ డైరీకి పూర్వ వైభవం తెస్తాం: స్పెషల్ హౌస్ కమిటీ

image

విశాఖ డైరీ అక్రమాలపై ఏర్పాటు చేసిన స్పెషల్ హౌస్ కమిటీ సోమవారం కలెక్టరేట్‌లో రివ్యూ జరిపింది. మేనేజంగ్ డైరెక్టర్ గారు కంపెనీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, త్రిప్ట్ సొసైటీ ద్వారా నిధుల మల్లింపు ఆరోపణలపైన కూడా వివరం కోరామని అన్నారు. రైతులకు న్యాయం చేసి రాజకీయాలకు అతీతంగా డెయిరీని అభివృద్ధి చేయడమే ఈ హౌసింగ్ కమిటీ లక్ష్యమని అన్నారు. అధికారులు సహకరిస్తే సాధ్యమని తెలిపారు.