News March 30, 2025
విశాఖ: 9 మంది పోలీస్ సిబ్బందికి వీడ్కోలు పలికిన సీపీ

విశాఖ నగర పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన 9 మంది పోలీస్ సిబ్బంది శనివారం పదవీ విరమణ చేశారు. వారికి విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖలో 40 ఏళ్ళకు పైగా సర్వీస్ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. రిటైర్మెంట్ జీవితం హాయిగా గడపాలని కోరారు. రిటైర్డ్ అయిన వారిలో ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సి, ఎఆర్‌హెచ్‌సీ, పీసీలు ఉన్నారు.
Similar News
News April 6, 2025
పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్‌పై లెర్నింగ్ నిర్వహించిన సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ పై సీపీ శంఖబ్రత బాగ్చి అవగాహనా కల్పించారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి అవగాహనా కల్పించారు. ప్రతి పోలీసు కుటుంబానికి మెడికల్ భద్రత అవసరమన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24/7 పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెల్ ద్వారా ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ చూసుకుంటుందన్నారు.
News April 5, 2025
మహిళా కాలేజి వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా విశాఖ ప్రభుత్వ మహిళా కాలేజీ వసతి గృహంలో శనివారం జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన చేతుల మీదగా కేక్ కట్ చేశారు. అనంతరం వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతిగృహంలో ఉన్న వసతుల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.
News April 5, 2025
విశాఖ: తండ్రి బైకు కొని ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య

తండ్రి బైకు కొని ఇవ్వలేదని కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ నగరంలో వెలుగు చూసింది. రామా టాకీస్ ప్రాంతంలో నివాసముంటున్న కార్తీక్ తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కార్తీక్ కొద్దిరోజులుగా బైక్ కోసం తండ్రితో గొడవ పడేవాడు. బైకు కొనకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ద్వారక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.