News April 28, 2024

విశాఖ: ‘AP CETకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు’

image

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ సెట్ 2024 నేడు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించరని మెంబర్ సెక్రటరీ ఆచార్య జీఎంజే రాజు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 79 కేంద్రాల్లో జరిగే పరీక్షకు 38,078 మంది హాజరుకానున్నారు.

Similar News

News December 12, 2025

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో 19 ఫిర్యాదులు

image

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 19 వినతులు వచ్చాయని చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ చెప్పారు.

News December 12, 2025

విశాఖలో సత్వా వాంటెజ్ సంస్థకు శంకుస్థాపన

image

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన సత్వా వాంటెజ్ క్యాంపస్‌ను ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌లో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

News December 12, 2025

ఐటీ హిల్స్‌లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

image

మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంగణంలో కాగ్నిజెంట్ కంపెనీ శాశ్వత భవనాల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు నగర ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.