News August 19, 2024
విశాఖ KGH డాక్టర్‌పై CMకు ఫిర్యాదు

విశాఖ KGH ఎముకల విభాగంలోని ఓ డాక్టర్‌పై అల్లూరి జిల్లా ప్రజా పరిరక్షణ కమిటీ సమన్వయకర్త దాలినాయుడు CM చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ ఆపరేషన్లకు రోగుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. KGHకు వచ్చే రోగులను తన సొంత క్లినిక్ తీసుకెళ్తున్నారని విమర్శించారు. మరి మీకు KGHలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ చేయండి.
Similar News
News January 5, 2026
విశాఖలో నో వెహికల్ జోన్ ఉందా? లేదా?

విశాఖ నగరంలో కాలుష్య నివారణకు జీవీఎంసీ పటిష్ట చర్యలను చేపట్టి గతంలో ప్రతి సోమవారం ‘నో వెహికల్ జోన్’ ప్రకటించింది. దీంతో జీవీఎంసీ మేయర్, కమిషనర్ సైతం ఆర్టీసీ బస్సులలో, సైకిల్ పైనా జీవీఎంసీ కార్యాలయానికి వచ్చేవారు. ఆ విధంగా వస్తూ ప్రతివారం వార్తలలో కనిపించేవారు. అయితే మేయర్ మారిన తరువాత నుంచి నో వెహికల్ జోన్‌పై వార్తా కథనాలు రాకపోవడంతో అసలు నో వెహికల్ జోన్ ఉందా లేదా అని ప్రజల ప్రశ్నిస్తున్నారు.
News January 5, 2026
తిమ్మాపురం బీచ్‌లో వృద్ధురాలి మృతి

తిమ్మాపురం బీచ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. 70 సంవత్సరాలు వయసున్న వృద్ధురాలు బీచ్ సమీపంలో రెండు రోజులుగా తిరుగుతూ ఉండగా స్థానికులు ఆహారం, దుప్పట్లు ఆమెకు ఇచ్చారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు గమనించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
నేడే విశాఖ కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని, పాత అర్జీదారులు రసీదులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం ‘1100’ కాల్ సెంటర్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


