News August 8, 2024
విశాఖ MLC ఉప ఎన్నిక: రెండో రోజూ నామినేషన్లు నిల్

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి బుధవారం కూడా నామపత్రాలు దాఖలు కాలేదు. ఈనెల 13 వరకు సమయం ఉంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ నాయకులు నామపత్రాలు తీసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణకు ఇప్పటికే ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. త్వరలో ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది. కాగా నేడు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు కూటమి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News December 12, 2025
విశాఖ నుంచి తిరుగుపయనమైన సీఎం

ఒకరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖకు శుక్రవారం వచ్చారు. విశాఖలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమై, పలు కంపెనీలకు మంత్రులు, అధికారులతో శంకుస్థాపన చేపట్టారు. అనంతరం వైజాగ్ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం తిరుగు పయనమయ్యారు. ఆయనకు ఎయిర్ పోర్ట్‌లో కూటమి నాయకులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
News December 12, 2025
అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర

విశాఖలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 4 జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల ఏడాది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బెల్ట్ షాపులు, నాటు సారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
News December 12, 2025
విశాఖ: సోలార్ ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష

APEPDCL పరిధిలోని 11 జిల్లాలు ఫీడర్ లెవెల్ సోలర్రైజేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశించారు. ఛైర్మన్‌తో పాటు కలెక్టర్లు, ముఖ్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. SC, ST గృహాలపై 400 MW రూఫ్ టాప్ సోలార్ పనులు మార్చిలోపు పూర్తి చేయాలని, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని సూచించారు. 35,676 గృహాలపై 114 మెగావాట్ల రూఫ్ టాప్ ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ పృథ్వి తేజ తెలిపారు.


