News December 6, 2024

విశాఖ: NAD కొత్త రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖ పరిధి NAD కొత్త రోడ్డులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ ఢీ కొట్టడంతో అడ్వకేట్ మృతి చెందారు. మృతుడు మర్రిపాలెం ఉడా కాలనీకి చెందిన పోతుల సూర్యనారాయణగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకి తరలించారు.

Similar News

News February 25, 2026

కంబాలకొడం అభివృద్ధి కి బృహత్ ప్రణాళిక

image

కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు. పర్యావరణహితంగా పర్యాటక కార్యకలాపాలు రూపకల్పన చేయాలని అటవీ అధికారులు పేర్కొన్నారు.

News February 25, 2026

విశాఖ:32 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

విశాఖ కమిషనరేట్ పరిధిలో 32 హోంగార్డ్ పోస్టులకు మంగళవారం విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు అప్లికేషన్లను విశాఖ సీపీ కార్యాలయంలో ఇన్‌వర్డ్ సెక్షన్లలో తీసుకుంటారన్నారు. వివిధ పోస్టులకు పది, ఐటీఐ, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్ చదివిన వారిని అర్హులుగా తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.