News August 16, 2024
విశాఖ: WOW.. నీటి లోపల జాతీయ జెండాతో విన్యాసం
హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ నావేల్ కమాండ్ ఆధ్వర్యంలో నౌకాదళ సిబ్బంది అత్యంత సాహసంతో డైవింగ్ చేస్తూ నీటి లోపల జాతీయ జెండాను ఎగరవేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజలు దేశభక్తిని చాటుకున్నారు. దాని స్ఫూర్తితో ఈ సాహస కార్యక్రమాన్ని నిర్వహించామని X (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
Similar News
News September 21, 2024
విశాఖ: 51 మంది వీఆర్వోలకు బదిలీలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడ్-2 వీఆర్వోలకు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల కోసం మొత్తం 234 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 51 మందికి బదిలీలు నిర్వహించినట్లు డీఆర్ఓ తెలిపారు.
News September 21, 2024
ఎస్.రాయవరంలో గురజాడ జయంతికి ఏర్పాట్లు
మహాకవి గురజాడ వేంకట అప్పారావు జయంతి నిర్వహించేందుకు ఆయన జన్మస్థలమైన ఎస్.రాయవరం గ్రామంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న గురజాడ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. ఈ సందర్భంగా గ్రామంలో శుక్రవారం, శనివారం గురజాడ జయంతి వేడుకలు జరుపుతామని గురజాడ ఫౌండేషన్ సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు తెలిపారు.
News September 20, 2024
విశాఖ: అత్యాచారం కేసులో సంచలన తీర్పు
విశాఖలో బాలికపై అత్యాచారం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ముద్దాయి జీ.వెంకట రమణకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. ప్రభుత్వం నుంచి బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆనందీ తీర్పు వెలువరించారు.