News August 8, 2024

విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:

image

అర్హులందరూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంప్రదాయ చేతివృత్తులలో పనిచేసే వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించే పని చేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

Similar News

News September 10, 2024

అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు

image

అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

News September 10, 2024

తాడిపత్రిలో అగ్నిప్రమాదం

image

తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2024

అనంతపురంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ

image

అనంతపురంలో ఈ నెల 11న జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఉరేగింపు ప్రారంభం కావాలని తెలిపారు. 10 అడుగుల కంటే ఎత్తయిన విగ్రహాలను పంపనూరు కెనాల్లో, 10 అడుగులకు తక్కువ విగ్రహాలను రాచన పల్లి వంకల్లో నిమజ్జనం చేయాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.