News January 28, 2025
విషాదం: హుస్సేన్‌సాగర్‌లో మృతదేహం లభ్యం

హుస్సేన్‌సాగర్‌లో అజయ్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన నాగారం వాసి అజయ్ కోసం కోసం DRF, NDRF దాదాపు 45 గంటలు గాలించాయి. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశాయి. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. భారత మాత హారతి కార్యక్రమంలో టపాసులు కాల్చుతుండగా ప్రమాదం జరగగా పలువురు గాయపడ్డారు. తప్పించుకునే క్రమంలో అజయ్ నీటిలో దూకేసినా ప్రాణాలు దక్కకపోవడం బాధాకరం.
Similar News
News February 7, 2025
నల్గొండ జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం

జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవికి ముందే జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదు కాగా, మూడు రోజుల్లోనే పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు పెరిగాయి. మరోవైపు గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలలతో పోల్చితే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు.
News February 7, 2025
మరోసారి SVSC తరహా మూవీ తీయనున్న అడ్డాల?

‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేకపోయారు. ముకుంద, నారప్ప ఫర్వాలేదనిపించగా బ్రహ్మోత్సవం, పెదకాపు నిరాశపరిచాయి. దీంతో ఆయన మరోసారి SVSC తరహా కుటుంబ కథను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అక్కాచెల్లెళ్ల మధ్య సాగే భావోద్వేగాలే ఇతివృత్తంగా ‘కూచిపూడి వారి వీధి’ అన్న మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
News February 7, 2025
కొణిజర్ల: కాల్వలో ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన గురువారం కొణిజర్ల మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..పెద్దగోపతికి చెందిన తడికమళ్ల రవి తన మిత్రులతో కలిసి మొక్కజొన్న పంటకు నీరు కట్టేందుకు ట్రాక్టర్‌పై జనరేటర్ తీసుకుని బయలుదేరాడు. రాపల్లె మేజర్ కాల్వ మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాల్వలో పడింది. రవిపై ఇంజిన్ తిరగబడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.