News July 9, 2024
విషాదం.. USలో చిట్యాల యువకుడి మృతి
గోపాలపురం మండలంలో విషాదం నెలకొంది. చిట్యాలకు చెందిన యువకుడు అమెరికాలో వాటర్ ఫాల్స్‌లో పడి మృతి చెందాడు. శ్రీనివాస్-శిరీష దంపతుల కుమార్తె అమెరికాలో ఉంటుండగా.. కుమారుడు అవినాశ్ MS చేసేందుకు అక్కడికి వెళ్లాడు. అక్క వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన అవినాశ్.. నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News October 14, 2024
నరసాపురం: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ఎగసి పడుతాయని, మళ్లీ ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.
News October 14, 2024
బందోబస్తును పరిశీలించిన ఏలూరు ఎస్పీ
ఏలూరు జిల్లా వైన్స్ లాటరీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన చలసాని గార్డెన్‌లోని బందోబస్తు ప్రదేశాన్ని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
News October 13, 2024
ఈనెల 14 నుంచి 20 వరకు గ్రామస్థాయిలో పల్లె పండుగ
ఈనెల 14 నుంచి 20 వరకు ప.గో జిల్లాలో గ్రామ స్థాయిలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 351 సీసీ రోడ్లు రూ.41.94 కోట్లు, 5 BT రోడ్స్ రూ.2.46 కోట్లు, 67CC డ్రైన్స్ రూ.6.63 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.