News December 21, 2024

విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోండి: జడ్పీ చైర్‌పర్సన్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా ప్రమాణాల స్థాయి పెంచే విధంగా విద్యా శాఖాధికారులు కృషి చేయాలనీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ చెప్పారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ వెట్రి సెల్వీ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు నియంత్రణకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మాతా శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు.

Similar News

News October 20, 2025

భీమవరం: నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్‌ కోరారు.

News October 20, 2025

పాలకోడేరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

image

పాలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

News October 19, 2025

పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

image

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్‌వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.