News June 22, 2024
విహారయాత్ర విషాద ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని దిగ్భ్రాంతి

బాపట్లలో జరిగిన విహారయాత్ర విషాద ఘటనపై ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దుగ్గిరాల నుంచి 11 మంది యువకులు రామాపురం బీచ్‌కు విహార యాత్రకు వెళ్లగా నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.

News November 20, 2025
30 గ్రామాల రీ-సర్వే తక్షణమే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రీ-సర్వే జరుగుతున్న 30 గ్రామాల డేటా ఎంట్రీని పూర్తి చేసి, వెంటనే సర్టిఫికెట్లు పంపాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం ఆయన మాట్లాడారు. భూ యజమానులకు కొనుగోలు, అమ్మకాలకు ఆటంకాలు ఉండకూడదన్నారు. థర్డ్ ఫేస్ రీ-సర్వేకు రైతులను రప్పించేందుకు తహశీల్దార్‌లు మరింత కృషి చేయాలని ఆదేశించారు. జీవో 30 భూముల పూర్తి నివేదికను అందించాలని ఆయన కోరారు.