News June 22, 2024

విహారయాత్ర విషాద ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని దిగ్భ్రాంతి

image

బాపట్లలో జరిగిన విహారయాత్ర విషాద ఘటనపై ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దుగ్గిరాల నుంచి 11 మంది యువకులు రామాపురం బీచ్‌‌కు విహార యాత్రకు వెళ్లగా నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే.

Similar News

News November 6, 2024

ఏలూరు: జిల్లా సిబ్బందితో ఎస్పీ నేర సమీక్ష సమావేశం

image

ఏలూరు జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బంది తో బుధవారం జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్టేషన్‌లలో నమోదు చేసిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా జిల్లా కేంద్రానికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేయాలని చెప్పారు. పోలీసు అధికారులు ప్రతి గ్రామాన్ని ప్రణాళిక బద్ధంగా సందర్శించాలని, ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిని పరిష్కరించాలని సూచించారు.

News November 6, 2024

ఉండి: ట్రైనింగ్‌లో కుప్పకూలి టీచర్ మృతి

image

టీచర్ ఆకస్మికంగా మృతిచెందిన ఘటన ప.గో జిల్లాలో జరిగింది. ఉండి మండలం ఉనుదుర్రు హైస్కూల్ ఇన్‌ఛార్జ్ HM తోట రత్నకుమార్ ఆగిరిపల్లి హీల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న లీడర్షిప్ శిక్షణకు హాజరయ్యారు. ఈక్రమంలో అక్కడ బుధవారం ఉదయం గుండె నొప్పి రావడంతో చనిపోయారు. తీవ్రమైన ఒత్తిడి, వైద్య సదుపాయాలు లేని అటవీ ప్రాంతంలో శిక్షణ ఇవ్వడంతోనే రత్నకుమార్ చనిపోయారని ఇతర టీచర్లు ఆరోపించారు.

News November 6, 2024

ప.గో: ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

image

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 11వ తేదీ నుంచి అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. ఈనెల 18 నామినేషన్ చివరి తేదీ అని, 19న పరిశీలన, 21న ఉప సవరణ చివరి తేదీ అని అన్నారు. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. డిసెంబర్ 9వ తేదీన లెక్కింపు జరుగుతుందని తెలిపారు.