News April 1, 2025
వి.కోటలో పేలిన నాటు బాంబు.. ఒకరికి తీవ్ర గాయాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లా వి కోట మండలం కస్తూరి నగరానికి చెందిన ఖాదర్ బాషా (42) కు నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. తన పొలం దగ్గర ఆవులకు గడ్డి వేయడానికి వెళ్లిన ఖాదర్ బాషా అక్కడ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వన్య మృగాలకు అమర్చిన నాటు బాంబు తొక్కడంతో అది పేలి కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే వికోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాటు బాంబు అమర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News December 8, 2025
విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- షాలిమార్(SHM)(నం.07148,49) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 9.35 గంటలకు CHZలో బయలుదేరే ఈ ట్రైన్ 9వ తేదీన ఉదయం 3.20కి విజయవాడ, రాత్రి 11.50 గంటలకు SHM చేరుకుంటుందన్నారు, 10న మధ్యాహ్నం 12.10కి SHMలో బయలుదేరి 11న ఉదయం 7.40కి విజయవాడ, సాయంత్రం 4 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందన్నారు.
News December 8, 2025
నిజామాబాద్ జిల్లాలో 8.4°C అత్యల్ప ఉష్ణోగ్రత

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో కోటగిరి 8.4°C, సాలూర 8.8, చిన్న మావంది 9.1, పొతంగల్ 9.2, జకోరా 9.2, డిచ్పల్లి 9.7, కల్దుర్కి 9.9°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎల్లో అలర్ట్లో గన్నారం, మోస్రా, గోపన్న పల్లి, మదన్ పల్లి, నిజామాబాద్ నార్త్ 10.1°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
News December 8, 2025
1.82లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం: జేసీ నవీన్

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి 29,866 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.502.50 కోట్లు చెల్లించామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే చెల్లింపులు చేస్తున్నామన్నారు. 72,98,622 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.


