News September 4, 2024
వి.కోటలో రెండో రోజూ 144 సెక్షన్
చిత్తూరు జిల్లా వి.కోట పట్టణంలో క్రికెట్ బాల్ వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇరువర్గాల దాడి నేపథ్యంలో పోలీసులు వి.కోట పట్టణంలో నిన్న 144 సెక్షన్ అమలు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. రెండు వర్గాల పెద్దలతో మాట్లాడిన కలెక్టర్, ఎస్పీ ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా వి.కోట పట్టణంలో బుధవారం రెండో రోజు 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.
Similar News
News September 10, 2024
సత్యవేడు MLA వివాదం..వైద్య పరీక్షలకు నో చెప్పిన మహిళ
సత్యవేడు MLA కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఆదిమూలం అత్యాచారం చేశాడంటూ ఆరోపించిన మహిళ TPT ఈస్ట్ పోలీసులపై మండిపడింది. ‘నన్ను ఎందుకు విచారిస్తున్నారు. నేను ఫిర్యాదు చేశా. MLAని అరెస్టు చేయండి’ అన్నది. అత్యాచార కేసులో వైద్యపరీక్షలు తప్పనిసరని CI మహేశ్వరరెడ్డి చెప్పినా పట్టించుకోలేదు. ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకానని తేల్చి చెప్పారు. గుండె నొప్పిగా ఉందని వైద్యానికి చెన్నై వెళ్తున్నట్లు తెలిపారు.
News September 10, 2024
చిత్తూరు: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడికి జైలు
ఓ వ్యక్తి మృతికి కారణమైన రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు జడ్జి వెన్నెల సోమవారం తీర్పు చెప్పారు. తిరువణ్ణామలై వాసి నాగరాజు చిత్తూరులో రిహాబిలిటేషన్ సెంటర్ నడుపుతుండగా.. మద్యం మాన్పాలని తరుణ్‌ను తల్లి ఆశ ఈ కేంద్రంలో చేర్చింది. అతడిని 6నెలలు కుటుంబానికి చూపకుండా, మోతాదుకు మించి ఔషధాలు ఇవ్వడంతో 2022లో మరణించాడు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని తెలిపారు.
News September 10, 2024
వాళ్లను వెంటనే రిలీవ్ చేయండి: చిత్తూరు DEO
చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల్లో టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసినట్లు DEO దేవరాజులు వెల్లడించారు. జిల్లాలో మొత్తంగా 464 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు చెప్పారు. ఆయా టీచర్లను ఎంఈవోలు, HMలు వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు.