News April 1, 2025
వి.కోట : రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

వి.కోట – పలమనేరు ప్రధాన రహదారిలో రాఘవపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి చెందాడు. అతను రామకుప్పం మండలం కంచిదాసనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గురుమూర్తిగా సమాచారం. మంగళవారం ఉదయం రాగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. స్థానికులు వి.కోట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News April 8, 2025
వెదురుకుప్పం: స్వగ్రామానికి మిస్ గ్లోబల్ ఏషియన్ విజేత

వెదురుకుప్పం మండలం పాతగుంట టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గోపికృష్ణరెడ్డి కుమార్తె భావన మిస్ గ్లోబల్ ఏషియన్-2025గా నిలిచింది. ఈక్రమంలో ఆమె పాతగుంటకు మంగళవారం చేరుకున్నారు. గ్రామస్థులు ఆమెకు ఆహ్వానం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రబాబు రెడ్డి, లోకనాథ రెడ్డి, తిమ్మరాజులు, హేమ శేఖర్, ఎమ్మెస్ రెడ్డి పాల్గొన్నారు.
News April 8, 2025
చిత్తూరులో భార్యపై యాసిడ్తో దాడి

చిత్తూరులో దారుణ ఘటన జరిగింది. నగరంలోని రాంనగర్ కాలనీకి చెందిన దావూద్, రేష్మ భార్యభర్తలు. మనస్పర్థలతో ఇటీవలే విడిపోయారు. ఈక్రమంలో నిన్న రాత్రి దావూద్ రేష్మ ఇంటికి వెళ్లి కాపురానికి రావాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో దావూద్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్ను రేష్మ ముఖంపై చల్లాడు. ఆమె గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. గాయపడిన రేష్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 8, 2025
చిత్తూరు DCHSగా పద్మాంజలి

చిత్తూరు జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి(DCHS)గా డాక్టర్ పద్మాజలి దేవి బాధ్యతలు చేపట్టారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్గా పని చేస్తూ జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారిగా ప్రమోషన్ పొందారు. ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్ ప్రభావతి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా పనిచేస్తానని చెప్పారు.