News February 28, 2025
వీఈఆర్‌లో మౌలిక సదుపాయాలపై చర్చ

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర, పూర్వ తూర్పుగోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వర్చువల్ సమావేశంలో చర్చించారు. వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి ఈసమావేశంలో నీతి ఆయోగ్ పథక సంచాలకులు పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ కిషోర్, వీఎంఆర్డీఏ ఎంసీ విశ్వనాథన్ పాల్గొన్నారు.
Similar News
News March 1, 2025
రోడ్డుప్రమాదంలో విశాఖ వాసి మృతి

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి మృతి చెందాడు. విశాఖ న్యూ పోర్టు కాలనీకి చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం అరకులోయ వైపు వెళుతుండగా డుంబ్రిగుడ మండలం నారింజవలస వద్ద స్కూటీ డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమనాథ్ మృతిచెందాడు. రామ్మోహన్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News March 1, 2025
విశాఖలో TODAY TOP NEWS

➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది
News February 28, 2025
బాధ్యతలు స్వీకరించనున్న ఏయూ వీసీ

ఆంధ్ర యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా జి.పి.రాజశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం యూనివర్సిటీ విభాగాల అధిపతులను కలుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి సందర్శకులను కలవనున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు ఏయూ ఇన్ ఛార్జ్ వీసీగా ఉన్న శశిభూషణరావు రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.