News June 30, 2024
వీఎస్‌యూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్‌గా సునీత

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా పనిచేసిన రామచంద్రారెడ్డి రెండేళ్ల పదవీ కాలం నిన్నటితో ముగిసింది. దీంతో ఆయన కడపలోని యోగి వేమన యూనివర్సిటీకి వెళ్లారు. దీంతో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్‌గా కె.సునీత యూనివర్సిటీ పరిపాలనా భవనంలో శనివారం భాధ్యతలు స్వీకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సునీతను సన్మానించారు.
Similar News
News September 16, 2025
నెల్లూరు నగరపాలక సంస్థలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇన్ఛార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ శివకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కమిషనర్ నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని కనకమహాల్ సెంటర్లో మూడంతస్తుల భారీ భవంతి నిర్మిస్తున్నారు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వ్యవహారాన్ని మేయర్ స్రవంతి ఇటీవల బయటపెట్టడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
News September 16, 2025
నెల్లూరు: డీఎస్సీలో 16 మిగులు సీట్లు

నెల్లూరు జిల్లా నుంచి డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 673 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 657 మంది ఎంపికయ్యారు. 16 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
నెల్లూరు జిల్లాలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు

రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్లని నియమించింది. పోలీసు శాఖలో ముగ్గురు మహిళలు ఉన్నత స్థాయిలో ఉండడంతో జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. అడిషనల్ ఎస్పీగా సౌజన్య ఉండగా.. టౌన్ డీఎస్పీగా సింధుప్రియా ఉన్నారు. అత్యంత సవాళ్లతో కూడుకున్న పోలీస్ శాఖలో మహిళా”మణు”లు బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.