News August 28, 2024
వీకోట: బీన్స్ పొలంలో గంజాయి సాగు
అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. రామకుప్పానికి చెందిన కృష్ణనాయక్, రాజేంద్రనాయక్ గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. కర్రిపల్లెకు చెందిన ఆనందప్ప అనే రైతు తన బీన్స్ పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి దాదాపు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News September 12, 2024
చిత్తూరు జిల్లా నేతలతో జగన్ సమాలోచనలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు ఇవాళ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు జిల్లాలోని పరిస్థితులను మాజీ సీఎంకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడాలని జగన్ సూచించారు. ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
News September 12, 2024
ఆరుగురు డాక్టర్లతో ఆదిమూలం బాధితురాలికి పరీక్షలు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలకి తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులతో పరీక్షలు చేశారు. ఎక్స్‌రే తీశారు. రక్త, వీడిఆర్ఎల్ పరీక్షలు చేసి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షలను రెండు సార్లు వాయిదా వేసినా.. మూడోసారి బాధితురాలు పరీక్షలకు హాజరయ్యారు.
News September 12, 2024
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఐరాల మండలం ఆడపగుండ్లపల్లి వద్ద రెండు బైకులు ఢీ కొని ఒక్కరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. 45-కొత్తపల్లెకు చెందిన నరేంద్ర(25) బైక్‌పై వస్తుండగా… వెంగంపల్లెకు చెందిన అఖిల్, కురప్పపల్లెకు చెదిన యశ్వంత్‌లు చిత్తూరు నుంచి ఇంటికి వెళ్లుండగా అడపగుండ్లపల్లె వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చిత్తూరు మార్చురీకి తరలించారు.