News February 13, 2026
వీడని AI భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. AI భయాలు ఐటీ రంగాన్ని వీడకపోవడం మొత్తం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 823 పాయింట్లు నష్టపోయి 82,851 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు కుంగి 25,541 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, ఎయిర్‌టెల్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, TCS, HCL టెక్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ భారీ నష్టాల్లో ఉన్నాయి.
Similar News
News March 9, 2026
మా దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరం: ఇరాన్ FM

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికలో విదేశీయుల ప్రమేయం అవసరం లేదని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడంలో తాము సాయం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘మా దేశ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వం. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ లీడర్‌ను నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. కాగా కొత్త నాయకుడిగా మొజ్తాబా ఎన్నికైనట్లు వార్తలొస్తున్నాయి.
News March 9, 2026
గంభీర్.. ఒక్క ఫైనల్‌లోనూ ఓడలేదు

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్‌గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్‌గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్‌గా 2, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. కోచ్‌గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.
News March 9, 2026
భారత మెన్స్ టీమ్ గెలిచిన ICC WCలు

భారత పురుషుల జట్టు ఇప్పటివరకు 5 సార్లు ప్రపంచకప్‌లు సాధించింది. అందులో రెండు వన్డే WCలు, మూడు T20WCలు ఉన్నాయి. 1983లో వన్డే ప్రపంచకప్, 2007లో టీ20 WC, 2011లో వన్డే ప్రపంచకప్, 2024లో టీ20 WC, 2026లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. కపిల్ దేవ్, ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల కెప్టెన్సీలో భారత్ ఈ కప్పులు సొంతం చేసుకుంది.


