News August 30, 2024

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని వారికి మెమోలు జారీ :కలెక్టర్

image

మున్సిపాలిటీలు, మండలాలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని దేవరకొండ మున్సిపల్ కమిషనర్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్, టిపిఓ ఇంజనీర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు.

Similar News

News November 18, 2025

నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

image

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్‌పీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.

News November 17, 2025

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

image

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.