News February 19, 2025
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి ఇతర ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగు, తాగునీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన, రైతు భరోసా, యూరియా కొరతపై కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.
Similar News
News March 21, 2025
డ్రగ్స్ నియంత్రణకు కార్యచరణ చేయాలి: కలెక్టర్

జిల్లాలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేస్తూ, నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.
News March 21, 2025
మహబూబాబాద్: చిన్నారిపై వీధి కుక్కల దాడి

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దవంగర మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలు.. వెన్నెల-మహేశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నందిని అంగన్వాడీ నుంచి తమ బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె ముఖం, తలకు తీవ్ర గాయాలు కావడంతో 108లో ఎంజీఎంకు తరలించారు.
News March 21, 2025
నాగర్‌కర్నూల్: కరుడుగట్టిన నిందితుడికి రిమాండ్

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని వివిధ మండలాలతోపాటు స్థానికంగా పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని రిమాండ్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నియోజకవర్గంలో దొంగతనాలు పెరిగిపోవడంతో జిల్లా పోలీసు అధికారి ఆదేశానుసారం పాలమూరు చౌరస్తాలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులను చూసిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు పంపించారు.