News February 20, 2025
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ

రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ల వాడకం మరింత పెంచాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా ముందడుగు వేయాలని డీజీపీ ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ తుషా డూడి వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
Similar News
News March 16, 2025
సీఎం సభకు 960 మంది సిబ్బందితో భద్రత

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడానికి వస్తున్న సందర్భంగా 960 మంది పోలీస్ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. ఎస్.పి, అడిషనల్ ఎస్పీ క్యాడర్‌కు చెందిన వారు 4 గురు, పది మంది డిఎస్పీలు, 69 సీఐలు మొత్తంగా 960 మంది సిబ్బందితో సీఎం సభకు భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.
News March 16, 2025
HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.
News March 15, 2025
ముస్లింలకే 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు?: DK శివకుమార్

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు ముస్లింలకే కేటాయించిందని కర్ణాటక సర్కారును ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ ఆ రాష్ట్ర Dy.CM డీకే శివ కుమార్ స్పందించారు. ‘కేవలం ముస్లింలకు 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు. వెనకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు అంటే ముస్లింలే కాదు. అందులో క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు, మొదలైన వారు ఉంటారు’ అని క్లారిటీ ఇచ్చారు.