News March 27, 2025

 వీడియో కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్ కలెక్టర్

image

హైదరాబాదు నుంచి సెర్ఫ్ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేశ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకెపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50శాతానికి పెంచాలన్నారు.

Similar News

News October 16, 2025

నవంబర్‌లో లండన్ పర్యటనకు CM చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్‌లో పర్యటించనున్నారు. విశాఖలో వచ్చేనెల 14, 15న జరగనున్న సీఐఐ సదస్సుకు రావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది.

News October 16, 2025

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

image

యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, పూర్తయిన వాటి వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ దశ వరకు పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులను బిల్లుల గురించి అడిగి, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News October 16, 2025

కర్నూలు ‘జీఎస్టీ 2.0’ సభలో స్వల్ప ప్రమాదం

image

కర్నూలులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణం ‘జీఎస్టీ 2.0’ సభలో స్వల్ప ప్రమాదం జరిగింది. విద్యదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.