News January 26, 2025
వీణవంక: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో రమ్య (25) అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రమ్య మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్, వీణవంక ఎస్సై తిరుపతి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
KNR: సీసీఎస్ PS నూతన కార్యాలయం ప్రారంభం

సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. గతంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపైన పనిచేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్‌లో నిర్మించిన నూతన భవనంలోకి తరలించారు. నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 28, 2025
కురిక్యాల ఘటనపై MLA సత్యం సీరియస్

గంగాధర మండల కురిక్యాల ZPHSలోఅటెండర్ యాకుబ్ పాషా విద్యార్థినుల పట్ల ప్రవర్తించి తీరుపై MLA మేడిపల్లి సత్యం సీరియస్ అయ్యారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై ఆరా తీసి, అధికారులు, స్కూల్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా పాఠశాలలో విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్, సీపీతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 28, 2025
హుజూరాబాద్: జమ్మికుంట రహదారిపై కొండచిలువ

హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారి వద్ద సోమవారం రాత్రి కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కొండచిలువ కన్పించడంతో జనం గుమిగూడరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుజూరాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్ ఖాన్‌ను పిలిపించారు. అతడు దానిని పట్టి క్షేమంగా దూరంగా గుట్టల్లో వదిలేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.


