News March 8, 2025
వీణవంక: బస్సులోనే గుండెపోటుతో మృతి

జమ్మికుంట-కరీంనగర్ వెళ్తున్న బస్సులో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు అనే వ్యక్తి బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సులోనే గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ చేరుకున్న అనంతరం బస్సు కండక్టర్ ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడు కరీంనగర్ ICICI బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.
Similar News
News March 27, 2025
సైదాపూర్ : ట్రాక్టర్ కిందపడి వ్యక్తి దుర్మరణం

ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మక్కల లోడుతో సైదాపూర్ నుంచి శంకరపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ దాని కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News March 27, 2025
సైదాపూర్: తాడిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

తాడిచెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల కనుకయ్య (53) అనే గీతకార్మికుడు తాటికల్లు తీయడానికి రోజూలాగే చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారిపడి అక్కడిక్కడకే మృతి చెందాడు. కనకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 26, 2025
KNR: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలి : కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. కేసు పూర్వాపరాలను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్య తీసుకోవాలన్నారు.