News December 22, 2024
వీణవంక: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బండారి చేరాలు బైక్పై జమ్మికుంటకు వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టంది. ఈ ప్రమాదం బేతిగల్ శివారులో జరిగింది. తీవ్ర గాయాలైన చేరాలుని చికిత్స నిమిత్తం హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేరాలు భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు.
Similar News
News November 27, 2025
KNR: ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు కరీంనగర్ లోని డా.బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పలు ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. చెస్, క్యారం, రన్నింగ్, షార్ట్ పుట్, జావలిన్ త్రో వంటి పోటీల్లో విభాగాల వారీగా అంధులు, బధిరులు, శారీరక, మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు.
News November 27, 2025
KNR: ‘వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి.’

కరీంనగర్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన TMKMKS రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి గురువారం గోరింకల నరసింహ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తె.మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ హాజరై మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలని, ప్రతి మత్స్య సొసైటీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
News November 27, 2025
KNR: ‘రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాదులో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిని కరీంనగర్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో ఫోన్లో మాట్లాడి సమస్యలపై పరిష్కారం చూపాలని తెలిపినట్లు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.


