News April 9, 2025
వీణవంక: వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ముద్దసాని!

కమలాపూర్ నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చేది ముద్దసాని దామోదర్ రెడ్డి అని చెప్పవచ్చు. 1985, 1989, 1994, 1999లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా 4సార్లు MLAగా విజయం సాధించాడు. 29 ఏళ్లకే MLAగా, 30ఏళ్లకు మంత్రిగా నియోజకవర్గానికి సేవలందించాడు. వీణవంక(M) మామిడాలపల్లి గ్రామానికి చెందిన దామోదర్‌రెడ్డి 2012 ఏప్రిల్ 9న అనారోగ్యంతో మృతిచెందాడు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయన సేవలు గుర్తుచేసుకుంటున్నారు.
Similar News
News April 22, 2025
ఆర్మూర్: చెరువులో మునిగి వ్యక్తి మృతి

చెరువులో పడిన గేదెను కాపాడబోయి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకాపూర్ శివారులోని గుండ్ల చెరువు వద్ద రమేశ్ గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు అతను చెరువులో దిగాడు. చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 22, 2025
AP న్యూస్ రౌండప్

* అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారీకి ADCL నిర్ణయం
* వచ్చే నెల 6 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
* మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి
* ఈ నెల 28న గుంటూరు మేయర్, కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు.. వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ
* బోరుగడ్డ అనిల్‌పై అనంతపురంలో కేసు.. ఈ నెల 30కి విచారణ వాయిదా
News April 22, 2025
కొత్తపేట: జగన్‌ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

ఇటీవల కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్ జగన్‌ను సత్కరించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం కోనసీమ జిల్లాలో వైసీపీని మరింతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగ్గిరెడ్డికి సూచించనట్లు నాయకులు వెల్లడించారు.