News February 13, 2025
వీరఘట్టం: అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య

అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీరఘట్టంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మణరావు(38) కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో గడ్డిమందు తాగాడు. గుర్తించిన భార్య చోడవరపుదేవి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.
Similar News
News November 21, 2025
ఎన్కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.
News November 21, 2025
90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో కిస్ సీన్!

ఇండియన్ సినిమాలో ముద్దు సీన్లు ఇప్పుడు కామన్. కానీ 90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో ముద్దు సీన్ స్టార్ట్ చేశారనే విషయం మీకు తెలుసా? 1933లో వచ్చిన ‘కర్మ’ చిత్రంలో నటీనటులు దేవికా రాణి, హిమాన్షు రాయ్ (నిజ జీవితంలో భార్యాభర్తలు) సుదీర్ఘమైన తొలి ముద్దు సీన్లో నటించారు. దాదాపు 4 నిమిషాల పాటు సాగిన ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిందని సినీవర్గాలు చెబుతున్నాయి.


