News April 2, 2025

వీరఘట్టం: ఎండ తీవ్రతకు వృద్ధురాలి మృతి

image

వీరఘట్టం మండల కేంద్రంలోని ముచ్చర్ల వీధికి చెందిన మంతిని గౌరమ్మ (85) మంగళవారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌరమ్మ ఎండ తీవ్రతను తాళలేక మరణించిందని స్థానికులు తెలిపారు. అయితే ఉదయం పెన్షన్ తీసుకున్న కొద్దిసేపటికి మృతి చెందింది. చుట్టాలు, బంధువులు ఎవరు లేకపోవడంతో వీధిలో ఉన్న వారంతా వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News November 12, 2025

SRCL: డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్

image

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. కంపోస్ట్ షెడ్‌ను పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

News November 12, 2025

సిరిసిల్ల: ‘రైతు బజార్‌లోనే విక్రయాలు జరగాలి’

image

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్‌లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్‌ను బుధవారం పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, పాల్గొన్నారు.

News November 12, 2025

SRCL: ‘కొత్తచెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి’

image

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇన్చార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. చెరువు కట్టపైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు.