News March 1, 2025
వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్పై వెళ్తున్న శివ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై జి. కళాధర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Similar News
News March 1, 2025
ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

✷ తాడేపల్లిగూడెంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్ ✷ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ✷ మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ✷ ఢిల్లీలో వర్క్ షాపునకు ఎంపికైన మహదేవపట్నం సర్పంచ్ ✷ పోలీస్ ఇండోర్ పరీక్షల్లో టాపర్గా మార్టేరు అమ్మాయి ✷ తణుకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ ✷ తణుకులో 123 మంది పరీక్షలకు గైర్హాజరు
News March 1, 2025
MBNR: యూడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.!

సదరం గుర్తింపు కార్డు కోసం యుడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు. సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లతో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
News March 1, 2025
గర్భిణులు, వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దు: APSDMA

APలో 3 నెలలపాటు ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని <