News March 7, 2025

వీరఘట్టం: హార్ట్ ఎటాక్‌తో మహిళ మృతి

image

వీరఘట్టం మేజరుపంచాయతీలోని ముచ్చర్లవీధికి చెందిన డాకూ సునీత (47 ) అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సునీతకు గుండెనొప్పి రావడంతో వీరఘట్టం పీ.హెచ్.సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత పార్వతీపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News November 4, 2025

విశాఖలో 1.89 లక్షల కేజీల గోమాంసం సీజ్

image

విశాఖ శివారు ప్రాంతమైన ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీలో భారీ మొత్తంలో గోమాంసాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. పూర్తి వివరాలతో ఓ వెటర్నరీ డాక్టర్ విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

News November 4, 2025

BELలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), పంచకులలో 10 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్+ITI+అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://bel-india.in/

News November 4, 2025

అష్టైశ్వర్యాలు అంటే ఏంటి?

image

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.