News August 4, 2024

వీరిది చిరకాల స్నేహం

image

స్నేహం ఒక మధుర జ్ఞాపకం. బాల్యం నుంచి సాగే జీవన పోరాటంలో ఎంతోమంది మనతో కలిసున్నా కొద్ది మంది మాత్రమే చివరి వరకు తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. అనంతపురం JNTU పూర్వ విద్యార్థులు వైశాలి, అరుణకాంతి, అజిత, భవానీ నేటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వారంతా అక్కడే ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. ఎలాంటి సందర్భంలోనైనా ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు.#FriendshipDay

Similar News

News October 1, 2024

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సవిత

image

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. యువతీ, యువకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు రూపకల్పన చేస్తున్నామని, ఆ డిజైన్లపై చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణతో సరిపెట్టకుండా చేనేత వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.

News September 30, 2024

అనంతపురం: 46 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు

image

అనంతపురం జిల్లాలో మంచి పనితీరు కనబర్చిన 46 మంది పోలీసు సిబ్బందికి SP జగదీష్ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులను సకాలంలో కోర్టు ముందు హాజరుపరిచి శిక్షలు పడేలా, హత్యా కేసుల్లో యావజ్జీవ శిక్షలు పడేలా కోర్టులకు సహకరించడం, ఏటీఎం కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషి చేశారన్నారు.

News September 30, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి అమ్మాయి

image

తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.