News April 27, 2024

వీరి పరిణయం ఆదర్శం 

image

అనంతగిరి మండలం పాలవరానికి చెందిన నాగమణి పుట్టుకతో అంధురాలు. కాగా తల్లి ప్రోత్సాహంతో నల్గొండ అంధుల పాఠశాలలో చేరి బ్రెయిలీ లిపితో డిగ్రీ పూర్తి చేసింది. ఆమెను వివాహం చేసుకునేందుకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్తికి చెందిన సోమగాని సందీప్ ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఈ జంట ఆదివారం పెద్దల సమక్షంలో ఒకటి కానుంది. 

Similar News

News November 15, 2025

నాగార్జునసాగర్ ఆసుపత్రిలో చిన్నారులకు అస్వస్థత

image

సాగర్‌లోని కమల నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది చిన్నారులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారికి గ్లూకోజ్, ఇంజెక్షన్లు ఇచ్చాక ఒక్కసారిగా చలి, జ్వరం, వాంతులు వచ్చాయని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. వారికి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

NLG: పేరుకే జిల్లా ఆస్పత్రి.. HYD వెళ్లాల్సిందే..

image

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మెదడు, ఇతర ప్రధాన అవయవాలకు గాయాలైనప్పుడు ఎంఆర్‌ఐ స్కాన్, స్పెషలిస్టుల చికిత్స తప్పనిసరి. ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ ఉన్నప్పటికీ, స్పెషలిస్టులు లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులకు సైతం ప్రాథమిక చికిత్స అందించి వైద్యం కోసం HYD పంపించాల్సిన దుస్థితి నెలకొంది.

News November 15, 2025

NLG: ర్యాగింగ్‌పై కఠిన చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇటీవల సంభవించిన ర్యాగింగ్‌ సంఘటనలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన యాంటీ-ర్యాగింగ్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ర్యాగింగ్‌ ఉదంతాలపై సమగ్రంగా చర్చించిన కమిటీ.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఏమాత్రం పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కఠిన చర్యలపై నిర్ణయం తీసుకుంది.