News January 17, 2025
వీరుడా.. ఇక సెలవు

విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణారెడ్డి (45) అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. చెన్నేకొత్తపల్లి మండలం బసినేపల్లిలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. వెంకటరమణారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. అమర్‌రహే అంటూ ప్రజలు నివాళులర్పించారు.
Similar News
News February 11, 2025
ఆనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు

అనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు వచ్చినట్లు అదనపు ఎస్పీ డి.వి. రమణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపి ఆదేశాలు జారీ చేశారు.
News February 10, 2025
రాప్తాడు వైసీపీలో ముసలం

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.