News October 20, 2024
వీర మరణం పొందిన కడప జిల్లా జవాన్ ఇతనే.!

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కొడవటికంటి రాజేశ్ ఛత్తీస్‌గఢ్‌లోని మిజాపూర్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం నక్సల్స్ అమర్చిన ల్యాండ్ మైన్ పేలి మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన జవాన్‌కు ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.
Similar News
News January 11, 2026
గండికోట ఉత్సవాలకు ఎన్ని రూ.కోట్లంటే.!

గండికోట ఉత్సవాలు 6 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలతో పర్యాటకులను అలరించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గండికోట చారిత్రక నేపథ్యాన్ని తెలిపే వీడియోలను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.3 కోట్లను విడుదల చేసింది.
News January 11, 2026
గండికోటకు వెళ్లాలంటే మార్గాలు ఇవే..!

గండికోటలో 11 నుంచి 13వ తేదీ వరకు ‘గండికోట ఉత్సవాలు’ జరుగుతున్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి.
➤ రోడ్డు మార్గం: జమ్మలమడుగు నుంచి రోడ్డు మార్గం ఉంది (17 KM)
➤ రైలు మార్గం: జమ్మలమడుగు స్టేషన్ నుంచి 18 KM, ముద్దనూరు స్టేషన్ నుంచి 25KM ఉంటుంది. స్టేషన్ల నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.
➤ విమాన మార్గం: కడపలో విమానాశ్రయం ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గండికోటకు చేరుకోవచ్చు.
News January 11, 2026
గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

గండికోట ఉత్సవాలలో నేడు(మొదటి రోజు) కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
➤ సాయంత్రం 4:00 – 5:30 గం.వరకు శోభాయాత్ర
➤ 5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
➤ 6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
➤ రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
➤ రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
➤ రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
➤ రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ.


