News February 21, 2025
వీలైనంత త్వరగా చిత్తడి నేలలను గుర్తించండి: కలెక్టర్

వీలైనంత త్వరగా చిత్తడి నేలలను గుర్తించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి చిత్తడి నేలల పరిరక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఫేస్-1, 2, 3లో జిల్లాలో గుర్తించదగిన చిత్తడి నేలల కోసం నోటిఫికేషన్ ప్రతిపాదనల తయారీ, సమర్పణ చేయాలన్నారు.
Similar News
News February 22, 2025
అనంతపురం టుడే టాప్ న్యూస్

☛ రేపు అనంతపురం జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు యథాతథం
☛ అనంతపురం జిల్లాలో 144 సెక్షన్
☛ అనంతపురం హైవేపై రోడ్డు ప్రమాదం
☛ గుత్తి బావిలో పదో తరగతి విద్యార్థి మృతి
☛ ఈ నెల 25న రాయదుర్గంలో జాబ్ మేళా
☛ అనంతపురం JNTU బీటెక్ పరీక్షా ఫలితాలు విడుదల
☛ పరిటాల శ్రీరాంను అభినందించిన జేసీ
News February 22, 2025
గ్రూప్-2 పరీక్షలపై అనంతపురం కలెక్టర్ క్లారిటీ!

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగవలసిన గ్రూప్-2 పరీక్షలు రద్దు అయ్యాయని సోషల్ మీడియాలో వస్తున్న వాటికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయలేదని తెలిపారు. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే పరీక్షలను వాయిదా వేయాలని APPSCకి ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.
News February 22, 2025
శ్రీ సత్యసాయి: తెలుగు టీచర్ సస్పెండ్

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో సూర్యనారాయణ రెడ్డి అరెస్టై అనంతపురం జిల్లా జైలులో ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేశామన్నారు.