News February 21, 2025

వీలైనంత త్వరగా చిత్తడి నేలలను గుర్తించండి: కలెక్టర్

image

వీలైనంత త్వరగా చిత్తడి నేలలను గుర్తించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి చిత్తడి నేలల పరిరక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఫేస్-1, 2, 3లో జిల్లాలో గుర్తించదగిన చిత్తడి నేలల కోసం నోటిఫికేషన్ ప్రతిపాదనల తయారీ, సమర్పణ చేయాలన్నారు.

Similar News

News March 26, 2025

అనంత: ‘రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

image

క్షేత్రస్థాయిలో ఎలాంటి పెండింగ్ లేకుండా రెవెన్యూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగింత, రీసర్వే, రెవెన్యూ సర్వీసులు, PGRS, తదితర అంశాలపై RDOలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News March 25, 2025

ఆ YCP నేతకు తాడిపత్రిలోకి NO ENTRY

image

తాడిపత్రికి చెందిన YCP ముస్లిం మైనార్టీ నేత ఫయాజ్ బాషాను పది రోజులపాటు తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు బహిష్కరించారు. గత 3రోజుల క్రితం ఫయాజ్ బాషా, JC ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా.. ఎలాంటి అల్లర్లు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫయాజ్ బాషాను పోలీసులు అనంతపురం తరలించారు. 

News March 25, 2025

తాడిపత్రిలో పెద్దారెడ్డికి నో ఎంట్రీ బోర్డ్‌!

image

తాడిపత్రి నియోజకవర్గంలోని YCP శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కీలక నేతలంతా యాక్టివ్‌గా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలూ పెద్దగా జరగడంలేదు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తనను తాడిపత్రికి వెళ్లకూడదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 9నెలల నుంచి ఇదే సాగుతోంది. ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు. మరోవైపు దూకుడుతో JC తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

error: Content is protected !!