News November 7, 2024
వీవీఐటీలో మంత్రి నారా లోకేశ్ సందడి
అమరావతిలోని వీఐటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో మంత్రి లోకేశ్ ఆద్యంతం సందడి చేశారు. ముందుగా వర్సిటీ చేరుకున్న మంత్రి లోకేశ్‌కు విశ్వవిద్యాలయ నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
Similar News
News December 10, 2024
గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్‌కు 172 అర్జీలు
సుదూర ప్రాంతాల నుండి పిజిఆర్‌ఎస్ లో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించకుంటే సంబంధిత జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 172 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు
News December 9, 2024
రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను గురజాల డీఎస్పీ జగదీష్ సోమవారం సందర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా రెంటచింతల స్టేషన్లోని పెండింగ్ కేసుల వివరాలను, రికార్డు మెయిన్టెనెన్స్ తీరును ఆయన పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. డీఎస్పీ వెంట కారంపూడి సీఐ శ్రీనివాసరావు ఎస్సై నాగార్జున ఉన్నారు.
News December 9, 2024
తాడేపల్లిలో మహిళపై అత్యాచారయత్నం
తాడేపల్లిలో ఓ మహిళపై ఆదివారం రాత్రి అత్యాచారయత్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తన కుమారుడి స్నేహితుడు రామారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో సదరు మహిళ భయంతో మాజీ CM జగన్ హెలీప్యాడ్ వైపు పరుగులు తీసింది. స్థానికుల సహాయంతో ఆ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.