News March 18, 2025

వృత్తిని ప్రేమించి.. బాధ్యతగా పని చేయండి: అజయ్ రావు

image

వృత్తిని ప్రేమించి బాధ్యతగా పని చేయాలని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు అన్నారు. ఎక్సైజ్‌ శాఖలో మహిళా కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 129 మంది విధుల్లో చేరుతున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి.. శిక్షణలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

Similar News

News November 12, 2025

చంచల్‌గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

image

HYDలోని చంచల్‌గూడ జైలులో జాబ్రి, దస్తగిరి అనే రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా జాబ్రీని సికింద్రాబాద్ గాంధీకి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన జాబ్రిను చూడగానే దస్తగిరి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. వీరి గొడవతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.

News November 12, 2025

HYD: రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఢోకా లేదు: TPCC

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.

News November 12, 2025

HYD: గాంధీ విగ్రహాల సేకరణ ప్రచార రథం ప్రారంభం

image

గాంధీభవన్‌లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాపన స్వర్ణోత్సవాల సందర్భంగా చేపట్టిన ‘ఒక అడుగు- లక్ష గాంధీజీ విగ్రహాలు’ కార్యక్రమానికి ప్రచార రథాన్ని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు పూనుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.