News November 12, 2024

వృద్ధురాలి హత్య కేసులో మరో నిందితురాలి అరెస్ట్

image

నెల్లూరులో ఎం.రమణి అనే వృద్ధురాలి హత్యకేసులో మూడో నిందితురాలిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సూట్ కేస్‌లో మ‌ృతదేహంతో చెన్నైలో పట్టుబడిన నిందితుడు బాలసుబ్రమ్మణంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బంగారు ఆభరణాల కోసమే తాను, తన భార్య సత్యవతి, కుమార్తెతో కలిసి వృద్ధురాలిని హత్య చేసినట్లు వెల్లడించాడు. దీంతో తండ్రిని, కుమార్తెను అరెస్ట్ చేశారు. కేసు మార్పు చేసి సత్యవతిని అరెస్ట్ చేశారు.

Similar News

News November 14, 2025

నెల్లూరు: 2 రోజుల పోలీస్ కస్టడీకి కిలాడి లేడీ డాన్ అరుణ

image

నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కిలాడి లేడీ డాన్ అరుణ రెండు రోజుల కస్టడీ నిమిత్తం గురువారం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై, అంగన్వాడి పోస్టులు ఇప్పిస్తామంటూ మోసగించినట్లు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీలో తీసుకుని విజయవాడకు తరలించారు.

News November 14, 2025

నెల్లూరు: సైలెంట్ కిల్లర్‌కు చెక్ పెట్టేది ఎలా.?

image

మధుమేహ వ్యాధి గురించి జిల్లా వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. NOV 14 తేదీని ‘వరల్డ్ డయాబెటిస్ డే’ గా పాటిస్తున్న సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 6 లక్షల మందికి పైగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. సైలెంట్ కిల్లర్ అని చెప్పుకునే మధుమేహానికి సరైన జీవనశైలితో చెక్ పెట్టొచ్చని అంటారు.

News November 14, 2025

షార్‌లో 141 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేడే లాస్ట్ డేట్

image

సూళ్లూరుపేటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)‌లో సైంటిస్ట్/ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్‌సైట్ చూడగలరు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 14.