News November 12, 2024
వృద్ధురాలి హత్య కేసులో మరో నిందితురాలి అరెస్ట్
నెల్లూరులో ఎం.రమణి అనే వృద్ధురాలి హత్యకేసులో మూడో నిందితురాలిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సూట్ కేస్‌లో మృతదేహంతో చెన్నైలో పట్టుబడిన నిందితుడు బాలసుబ్రమ్మణంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బంగారు ఆభరణాల కోసమే తాను, తన భార్య సత్యవతి, కుమార్తెతో కలిసి వృద్ధురాలిని హత్య చేసినట్లు వెల్లడించాడు. దీంతో తండ్రిని, కుమార్తెను అరెస్ట్ చేశారు. కేసు మార్పు చేసి సత్యవతిని అరెస్ట్ చేశారు.
Similar News
News December 8, 2024
మనుబోలు హైవేపై లారీ బోల్తా
మనుబోలు మండలంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ పక్కన సర్వీస్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వెళుతున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
News December 8, 2024
రోడ్డు ప్రమాదంలో నలుగురు సిరిపురం వాసులు స్పాడ్ డెడ్
పల్నాడు జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో చనిపోయింది కావలి మండలం సిరిపురం వాసులుగా సమాచారం. వారు కారులో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం అనంతరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తుళ్లూరి సురేష్, వనిత, యోగిలు, వెంకటేశ్లర్లుగా గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News December 7, 2024
పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ: కలెక్టర్
పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరమని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట డీసీఆర్ జెడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడతాయన్నారు.