News February 2, 2025
వృద్ధులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు: కలెక్టర్

వయోవృద్ధులు తమ సమస్యలను తెలియజేసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు బాలు నాయక్ తదితరులు ఉన్నారు.
Similar News
News February 19, 2025
శుభ ముహూర్తం (బుధవారం, 19-02-2025)

తిథి: బహుళ సప్తమి
నక్షత్రం: విశాఖ ఉ.8.11 నుంచి
శుభసమయం: ఉ.9.04 నుంచి 9.28 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36- మ.12.24
వర్జ్యం: మ.2.25 నుంచి మ.4.11 వరకు
అమృత ఘడియలు: రా.12.58 నుంచి రా.2.44 వరకు
News February 19, 2025
వికారాబాద్: అభివృద్ధి లక్ష్యంగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్

నాబార్డ్ ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో 2025-26 నాబార్డ్ పొటెన్షియల్ లింక్ క్రెడిట్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. ప్రాధాన్యతా విభాగంలో అందుబాటులో ఉన్న భౌతిక ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
News February 19, 2025
గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే అని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.